TG: వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు గెలిచి మళ్లీ రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. LB స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభలో సీఎం మాట్లాడారు. 100 కంటే ఒక్క సీటు తక్కువ వచ్చినా తనదే బాధ్యతని సీఎం చెప్పారు. కార్యకర్తలకు అన్ని పదవులు దక్కే వరకూ విశ్రాంతి తీసుకోబోనని పేర్కొన్నారు. అలాగే ఈసారి పదిహేను పార్లమెంట్ స్థానాల్లో గెలిచి ఢిల్లీకి 15 మంది ఎంపీలను పంపుతామన్నారు.
Post Views: 90








