TG: హైదరాబాద్కు మోదీ చేసింది శూన్యమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరీ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా.. ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను చేసి చూపిస్తుందన్నారు. గిగ్ వర్కర్ల హక్కుల కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం చట్టం తీసుకువస్తోందని తెలిపారు.
Post Views: 87








