AP: ఈరోజుల్లో డబ్బులు పెట్టనిదే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా నరసింహపురంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు. “డబ్బులు పెట్టుకుని ఎన్నికల్లో గెలవండి. నాకు అభ్యంతరం లేదు. డబ్బులు పెట్టి గెలిచినా కానీ ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు ఉపయోగపడేలా పాలన చేస్తే మీరు డబ్బుతో గెలిచారన్న విషయాన్ని కూడా వదిలేస్తా.” అని పవన్ వ్యాఖ్యానించారు.
Post Views: 63








