Mahaa Daily Exclusive

  కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల సాకారం: భట్టి

Share

TG: ఇల్లు లేని పేదల బాధలను అర్థం చేసుకొని ప్రజా ప్రభుత్వం రూ.22,500 కోట్లతో తొలి ఏడాది 4.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిరలో పర్యటించిన ఆయన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతోనే సాధ్యమవుతుందన్నారు.

Latest