మందమర్రి, మహా : మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి రామన్ కాలనీలో సోమవారం
కటకం శ్రీనివాస్ (45) అనే వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానిక ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
గతంలో మృతుడు శ్రీనివాస్ లారీ డ్రైవర్గా పనిచేసేవాడని తెలిపారు. అతడికి 15 సంవత్సరాల క్రితం ఒక ప్రమాదంలో జరిగి తీవ్రంగా గాయపడ్డాడని వివరించారు. కాగా అప్పటి నుండి శారీరకంగా ఏ పనీ చేసుకోలేని పరిస్థితిలో ఉండటంతో పాటు, తీవ్రమైన మానసిక వేదనతో మద్యానికి బానిసయ్యాడని వెల్లడించారు.
ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేనిలో ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడినట్లు
మృతుని భార్య కటకం రమ్య ఫిర్యాదు ఇచ్చినట్లు చెప్పారు. మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మందమర్రి ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
Post Views: 40







