Mahaa Daily Exclusive

  రిమ్స్ పర్యవేక్షణ కు అధికారుల నియామకం..!

Share

ఆదిలాబాద్, మహా

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో మరింత మెరుగైన సేవలు, నిరంతర పర్యవేక్షణ కోసం అధికారులను నియమించారు. రిమ్స్
జనరల్ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ దీపక్ పుష్కర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ బండారి నరేందర్ ను నియమిస్తూ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా రిమ్స్ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ లుగా సాయి ప్రసూన్, వసంత్ రావు, కృష్ణప్రసాద్ లను, సూపర్ స్పెషాలిటీ ఆర్ఎంఓగా చంపత్ రావు ను నియమించిన్నట్లు డైరెక్టర్ వెల్లడించారు.

Latest