ఆదిలాబాద్, మహా
ప్రజల నుంచి వచ్చే వినతులను ఆయా శాఖల అధికారులు సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్శి షా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. 91అర్జీలు రాగ పరిష్కరించడంలో జాప్యం లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. స్కూల్స్, అంగన్వాడీ లు, ఫర్టిలైజర్ దుకాణలు, హాస్టల్స్, ఆసుపత్రులు తదితర వాటిని క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించాలని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, డిన్నర్ తదితర వాటిని చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలదేవి, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా,ఆర్ డీ ఓ వినోద్ కుమార్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 26








