Mahaa Daily Exclusive

  వాణిజ్య సముదాయాల కార్మికులను దోచుకునే జీవోను రద్దు చేయాలి సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ ..!

Share

ఆదిలాబాద్, మహా

వాణిజ్య సముదాయాల్లో పనిచేస్తున్న కార్మికుల పనిదినాన్ని 8గంటల నుండి 10 గంటలకు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 282 జీవోను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేసారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించి జీవో ప్రతులను చింపివేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య సముదాయంలో పనిచేస్తున్న కార్మికుల శ్రమను దోచుకోవడం కార్పొరేట్లకు, యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికుల పని దినాన్ని ఎనిమిది గంటల నుండి 10 గంటలకు పెంచిందని తెలిపారు. పని గంటల పెంపు కార్మికుల శ్రమను దోచుకోవడానికి అవకాశాన్ని కల్పించడమే అవుతుందని పేర్కొన్నారు. కానీ ఇదే సందర్భంలో వాణిజ్య సముదాయంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు వసతుల కల్పన ఇతర సమస్యల పరిష్కారం గురించి ప్రభుత్వం ఆలోచించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వానికి కార్మికుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నదని వివరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ లో పనిచేస్తున్న కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలను ఇప్పటివరకు సవరించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికీ షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్ కార్మికులు అతి తక్కువ వేతనాలు పొందుతూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే కార్మికులకు చెల్లించాల్సిన కనీస వేతన జీవోలను సవరించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ కనీస వేతనం రూ.26 వేలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని జీవో నెంబర్ 282ను వెంటనే రద్దు చేయాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో కార్మిక సంఘాలు ఐక్యంగా కార్మిక లోకాన్ని కదిలించి అసెంబ్లీని సెక్రటేరియట్ను ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జే దళిత్, జగన్ సింగ్,సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రేసు సురేందర్, పండుగ పొచ్చన్న,రమాకాంత్, చంద్రశేఖర్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు

Latest