TG: మానవీయ కోణంలో భూసమస్యలను పరిష్కరించాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని భూసమస్యలపై ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 40-50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపాలని మంత్రి ఆదేశించారు.
Post Views: 61








