వరంగల్ మహా;
వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి , జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డిఆర్డిఓ కౌసల్యాదేవి,ఆర్డీవోలు వరంగల్ సత్యపాల్ రెడ్డి, నర్సంపేట ఉమారాణి లు పాల్గొని ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరించారు.
స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ త్వరగా పరిష్కరించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ ప్రజావాణిలో మొత్తం 78 దరఖాస్తులు రాగా ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవి 37, కలెక్టరేట్ కు 6, జిల్లా పంచాయతీ శాఖకు సంబంధించిన 6 దరఖాస్తులు, మిగతా శాఖలకు సంబందించిన దరఖాస్తులు 29 స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి లో స్వీకరీంచిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఖాదీ కార్మికులను ప్రోత్సాహించుటకు
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా ఖాదీ వస్త్రాలు ధరించి హాజరు కావాలన్నారు.
మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవన భృతి పెంపొందించుటకై స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులు ఆయా స్టాల్స్ సందర్శించి వస్తు సామాగ్రి, తినుబండారాలను కొనుగోలు చేసినచో స్వయం సహాయక సంఘాలను ప్రోత్సాహం కల్పించివచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
(DEET) గోడ పత్రి ఆవిష్కరణ
జియం ఇండస్ట్రియల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్చేయింజ్ తెలంగాణ (DEET) గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చే ఆవిష్కరించ డమైనది.
ఈ కార్యక్రమం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, డిబిసిడివో పుష్పలత, కలెక్టరేట్ పరిపాలన అధికారి విశ్వప్రసాద్ వరంగల్, ఖిలా వరంగల్ తహసిల్దార్లు ఇక్బాల్,నాగేశ్వర్ రావు, సంబంధిత శాఖల అధికారుల తో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








