Mahaa Daily Exclusive

  రేపు జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి… కార్మిక సంఘం ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం ..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మిక, కర్షకులుపెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల పోరాట వేదిక సమక్షంలో, ఇబ్రహీంపట్నం సిఐటియు మండల కన్వీనర్ సిహెచ్ బుగ్గరాములు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా స్థాయి సమావేశం ఇబ్రహీంపట్నం పాషా, నరహరి స్మారక కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ… కార్మికులు పోరాడి సాధించిన 29 కార్మిక చట్టాలను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ లేబర్ కోడ్స్ ద్వారా కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. ఉద్యోగ భద్రతకు విఘాతం కలుగుతుంది. 8గంటల పని దినాలను 12 గంటలకు పెంచడం సరికాదు. కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాలి. ఈఎస్, ఐపీఎఫ్ సౌకర్యాలు కల్పించకుండా కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. రైతులకు కనీసం మద్దతు ధర అమలు చేయాలి. ఢిల్లీలో రైతుల చేసినా పోరాటానికి దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనికి నిధులు కేటాయించాలి. 200 రోజుల పని దినాలు పెంచి 600 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ కూలీలకు కూలి వేతన చట్టాలు తీసుకురావాలన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో తగిన చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు. ప్రతి మహిళకు 2500 మహిళా సాధికారిక అమలుకు నోచుకోవడం లేదు. కళ్యాణ లక్ష్మికి, గృహలక్ష్మి నిధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మతాల మధ్య విద్వేషాలు పెంచి కేంద్ర ప్రభుత్వం తమ పబ్బం గడుపుకుంటుందన్నారు. కార్మికులకు, కర్షకులకు నష్టం కలిగించే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, కర్షకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, ప్రజా సంఘాల నాయకులు పగడాల యాదయ్య ,చంద్రమోహన్, మధుసూదన్ రెడ్డి, కందుకూరి జగన్, సుమలత, కవిత, ప్రకాష్ కరాత్, శంకర్, పంది జగన్, గణేష్, విజయమ్మ, సామెల్, ప్రణయ్, నరసింహ, అంజయ్య, రామచందర్, జంగయ్య, ఎల్లేశ, సప్న తదితరులు పాల్గొన్నారు.

Latest