Mahaa Daily Exclusive

  నవోదయ విద్యాలయాల నోటిఫికేషన్ కరపత్రం విడుదల చేసిన కలెక్టర్..!

Share

భూపాలపల్లి మహా :

నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అడ్మిషన్లు కరపత్రాన్ని ఆవిష్కరించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. దరఖాస్తు చివరి తేది జూలై 29, డిసెంబర్ 13వ తేదీ పరీక్ష ఉన్నట్లు పేర్కొన్నారు.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల్ని ఆహ్వానింలస్తున్నారని, ఈ నోటిఫికేషన్‌ను నవోదయ విద్యాలయ సమితి విడుదల చేసినట్లు తెలిపారు. దరఖాస్తు చేయు విద్యార్థులు https://navodaya.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన సూచించారు.
అర్హతలు
విద్యార్థులు జిల్లా స్థానిక నివాసితులై ఉండాలి.
2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
2014 మే 1 నుండి 2016 జూలై 31 మధ్య జన్మించినవారు మాత్రమే అర్హులు.
ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3వ మరియు 4వ తరగతులు పూర్తిచేసి ఉండాలి. అన్ని పాఠశాలలకు సమాచారం అందించి విద్యార్థులు దరఖాస్తు చేయు విధముగా అవగాహన కల్పించాలని డీఈఓ కు సూచించారు.
పరీక్షా నిర్వహణ తేదీ డిసెంబర్ 13, 2025.
విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఉత్తమ విద్యా బోధన కలిగిన నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
సమాచారం కొరకు 9110782213,
7993263431హెల్ప్ లైన్ నంబర్ల కు కాల్ చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జవహర్ నవోదయ కళాశాల ప్రిన్సిపాల్ పూర్ణిమ, .డీఈఓ రాజేందర్, నవోదయ కళాశాల
మాథ్స్ ఉపాధ్యాయులు సురేష్, లిబ్రేరియన్ లక్ష్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జవాని దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులు, సమస్యల దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 63 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రజావాణి దరఖాస్తులతో పాటు ప్రజాభవన్ హైదరాబాద్ నుండి వచ్చిన దరఖాస్తులు వచ్చే సోమవారం లోపు పరిష్కరించి, పరిష్కార నివేదికలు అందచేయాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచడం వల్ల ప్రజావాణి కార్యక్రమ లక్ష్యం నెరవేరదని కలెక్టర్ అన్నారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమ ధ్యేయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు తడితరులు పాల్గొన్నారు.

Latest