Mahaa Daily Exclusive

  నేడు మండల పరిషత్ సమావేశం..!

Share

కాటారం, మహా :

మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11:30 గంటలకు మండల పరిషత్ ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని ఎంపీడీవో అడ్డూరి బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులు,పంచాయితీ కార్యదర్శు లు సమీక్షా సమావేశంనకు అందరూ సకాలంలో హాజరుకావాలని తెలిపారు.
1. రాబోవు వర్షాకాల వరదల నివారణ చర్యలు మరియు సీజనల్ వ్యాధులపై అవగాహన. 2. మంచినీటి వనరుల క్లోరినేషన్, పైపులైను మరమ్మతులు.3. స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమం నిర్వహణ పై సమీక్ష ఉంటుంది. అందరూ అధికారులు రెవిన్యూ, పంచాయితీ విభాగం,నీటిపారుదల, మేడికల్, ఐసీడీఎస్,విద్యాశాఖ, హాస్టల్ వెల్ఫేర్, మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, రోడ్లు భవనములు, పోలీస్ శాఖ ,మత్స్య శాఖ శాఖా పరమైన నివేదికలతో రావాలని ఎంపీడీఓ తెలిపారు.

Latest