వరంగల్ మహా;
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వెంకటరమణ
అంతర్జాతీయ డాక్టర్స్ కాన్ఫిరెన్స్ లో భాగంగా వారం రోజుల విదేశీ పర్యటన ముగించుకొని సోమవారం హైదరాబాద్, నాంపల్లి లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన ఎన్ రామచందర్ రావు ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపార అనుభవం, నాయకత్వ పటిమ కలిగిన రామచందర్ రావు నేతృత్వంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో మరింత బలపడుతుందని వారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం కైవసం చేసుకుంటామని, ప్రజా సమస్యల పై వారితో పాటు పోరాడుతమని, వారి వెంట నడిచి పార్టీ అభివృద్ధి కి కృషి చేస్తానని డాక్టర్ వన్నాల వెంకట రమణ తెలిపారు.
వారి వెంట రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కొల్లి మాధవి, ముఖ్య నాయకులు ఉన్నారు.
Post Views: 90








