Mahaa Daily Exclusive

  ప్లాంటేషన్‌ పోడు వద్ద ఉద్రిక్తత పోడు సాగును అడ్డుకున్న ఫారెస్టు అధికారులు ప్లాంటేషన్‌ పోడును సందర్శించిన డీఎఫ్‌వో..!

Share

కారేపల్లి, మహా : కారేపల్లి మండలం మాణిక్యారరాఎర్రబోడు ఊటవాగు సమీపంలోని ప్లాంటేషన్‌ పోడు లో సోమవారం ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. ప్లాంటేషన్‌ పోడుకు ప్రత్యామ్నాయం పోడు చూపుతామని 2020 సంవత్సరంలో 60 మంది పోడు దారుల నుండి 50 హెక్టార్లు పోడును సేకరించిన ఫారెస్టు అధికారులు, బాధితులకు ప్రత్యామ్నాయ పోడు చూపకుండా తాత్సర్యం చేయటంతో ఐదేండ్లుగా పోడు వివాదం రగులుతునే ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు పోడు సమస్యకు పరిష్కారం చూపుతామని కాలం వెళ్లదీస్తుండటంతో చేసేది లేక పోడుదారులు తమ పోడును సాగు చేసుకోవటానికి ప్లాంటేషన్‌ ప్రాంతానికి చేరుకోని ప్లాంటేషన్‌ పోడులో అరకలు కట్టి సాగు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు ఆప్రాంతానికి వెళ్ళి పోడుసాగుదారులను అడ్డుకున్నారు. దీంతో పారెస్టు, పోడుదారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అదే క్రమంలో హక్కు పత్రాలు ఉన్న రైతు తమ పోడులో ఎరువులు వేయటానికి వెళ్లుతుండగా అతనిని సైతం ఫారెస్టు అధికారులు ఆపటంతో రైతులు అగ్రహంతో వాగ్వివాగం దిగారు. ప్లాంటేషన్‌ కు తమ పోడును ఇస్తే ఫారెస్టు అధికారులు తమను మోసం చేసి పేదలమైన తమకు పోడు భూమి లేకుండా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము గతంలో సాగు చేసిన పోడును తమకే కావాలని పట్టుపట్టారు. విషయం తెలుసుకున్న జిల్లా ఫారెస్టు అధికారు ప్లాంటేషన్‌ ప్రాంతానికి చేరుకోని విచారించారు. డీఎఫ్‌వో పోడుదారులు తమ సమస్యను విన్నవించారు. ప్లాంటేషన్‌ చుట్టు హక్కుపత్రాలు ఉన్న పోడు ఉందని వాటికి తమ భూములే రికార్డులలో హద్దులుగా ఉన్నాయని డీఎఫ్‌వో చూపారు. ప్లాంటేషన్‌కు కొంత భూమి ఇస్తే తమ సమస్య శాశ్వతంగా తీరుతుందని ఆశిస్తే ఫారెస్టు అధికారులు అసలుకే ఎసరు పేడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కొత్తగా వచ్చానని రెండు రోజులలో దీనిపై విచారిస్తాని అప్పటి వరకు ప్లాంటేషన్‌ లోకి వెళ్లవద్దని పోడుదారులను కోరారు. తాము సాగు చేయకుండా ప్లాంటేషన్‌ వద్దనే ఉంటామని సమస్యలను త్వరితగతిని పరిష్కరించాలని కోరారు.

ప్లాంటేషన్‌ పోడు బాధితులకు న్యాయం చేయాలి ` ప్రజాసంఘాలు

ప్లాంటేషన్‌ పోడు బాధితులకు ప్రత్యామ్నాయ పోడు చూపు వారి న్యాయం చేయాలని ప్రజాసంఘాల నాయకులు కొండెబోయిన నాగేశ్వరరావు, వజ్జా రామారావు, కే.నరేంద్ర లు డిమాంఢ్‌ చేశారు. ప్లాంటేషన్‌లో 23 మంది రైతులు నష్టపోయారని వారికి ప్రత్యామ్నాయం చూపాల్సిన ఫారెస్టు అధికారులు తాత్సర్యంలో సమస్య జఠిలం అయిందన్నారు. ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిచ్చే క్రమంలో ప్లాంటేషన్‌ పోడు దారుల భూములను సైతం సర్వే చేశారని కాని వారికి పట్టాలివ్వలేదన్నారు. పేదలకు న్యాయచేయాలని లేదంటే వారికి మద్దతుగా అందోళనకు సైతం సిద్దమని హెచ్చరించారు.

Latest