Mahaa Daily Exclusive

  జులై 9 న జరిగే సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి..!

Share

కారేపల్లి, మహా : పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం పనిచేస్తూ కేంద్ర బిజెపి ఉద్యోగ కార్మిక కర్షక రైతాంగ హక్కులకు తీవ్ర నష్టం చేస్తుందని కార్మిక వర్గానికి నష్టదాయకమైన నాలుగు లేబర్‌ కోడలు వెంటనే రద్దు పరచాలని జులై 9న చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం భాగం రామనర్సయ్య భవన్లో సిఐటియు మండల కన్వీనర్‌ కే నరేంద్ర అధ్యక్షతన జరిగిన ప్రజా సంఘాల సమావేశంలో తెలంగాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు ఐ ఎఫ్‌ టి యు జిల్లా భూక్య సక్రనాయక్‌ రైతు కూలీ సంఘం నాయకులు గూగుల్లోతు తేజనాయక్‌ పి ఓ డబ్ల్యు నాయకురాలు వై జానకి మాట్లాడుతూ కేంద్రం అధికారంలోకి కొనసాగుతున్న బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్యోగ కార్మిక కర్షక రైతాంగ సమస్త ప్రజలు హక్కులను హరిస్తుందని ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానం రద్దుపరిచి సంఘం పెట్టుకునే హక్కు లేదు అంటూ కనీస వేతన చట్టాన్ని అమలు చేయకపోగా స్కీం వర్కర్ల ఉద్యోగ భద్రతకే ముప్పు తెచ్చిందని ప్రభుత్వ పరిశ్రమలను.వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు ధారాధత్వం చేస్తూ కార్మిక హక్కులను రద్దు పరచి నాలుగు లేబర్‌ కోడ్స్‌ నల్ల చట్టాలను తీసుకువచ్చిందని నష్టదాయకమైన ఈ విధానాలను మానుకోవాలని ఆషా అంగన్వాడి మధ్యాహ్న భోజనం తదితర స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 నిర్ణయించాలని రైతాంగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉపాధి హామీ చట్టాన్ని నిధులు కేటాయించాలని తదితర డిమాండ్లతో ఈ నెల 9న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక రైతంగా వ్యవసాయకార్మిక మహిళ విద్యార్థి నిరుద్యోగ సమస్త ప్రజలు పాల్గని మండల కేంద్రంలో నిరసన ప్రదర్శన లో భాగస్వామ్యం సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Latest