Mahaa Daily Exclusive

  బి ఆర్ ఎస్ నాయకుని వ్యాఖ్యలు ఖండించిన టి జి ఈ జేఏసీ క్షమాపణ చెప్పాలని డిమాండ్..!

Share

మహా భద్రాచలం

చర్ల మండలం, సత్యనారాయణపురం తాలిపేరు ప్రాజెక్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీగా విధులు నిర్వహిస్తున్న తిరుపతి పై బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు రావులపల్లి రాంప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ టీ జీ ఈ జేఏసీ రాష్ట్ర, జిల్లా శాఖలు ఖండించాయు.
ప్రజలకు సేవలందించడంలో నిమగ్నమైన ప్రభుత్వ ఉద్యోగులపై
పరుష పదజాలంతో మాట్లాడడాన్ని అసోసియేషన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ విధంగా వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయ నాయకులకు తగదని టి జి ఈ జేఏసీజిల్లా నాయకులు సంగం వెంకట పుల్లయ్య , మహేష్, దస్రు, డెక్క నరసింహారావు, బాలకృష్ణ స్పష్టం చేసారు. భవిష్యత్తులో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏ అధికారిపై అయినా పునరావృతం అయితే సంఘం తరఫున తదుపరి చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.అనుచిత వ్యాఖ్యలు చేసిన రాంప్రసాద్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Latest