మంచిర్యాల, మహా : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ విద్యార్థినీలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం వసతి గృహం ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు మాట్లాడుతూ ఇక్కడి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినీల (మహిళలు) కనీస వసతులు, అవసరాలు తీర్చాలని ప్రిన్సిపాల్ కు చెప్పితే స్పందించడం లేదని ఆరోపించాడు. ఆడవాళ్ళ పర్సనల్ విషయాలు మీడియాకు ఎలా చెప్పేదని వారు వాపోయారు. వీరికే కాకుండా ఇతరత్రా విద్యార్థి సంఘాల నాయకులకు, కుల సంఘాల ప్రతినిధులకు సమాచారం అందించిన ఫలితం లేకపోవడంతో నేరుగా ఈ ఆందోళనకు దిగినట్లు వారు వెల్లడించారు. మేము నిత్యం పడుతున్న మా సమస్యలపై ఐటీడీఏ పీవో స్పందించి హాస్టల్ భవనంలో విద్యార్థులపై జరుగుతున్న నిర్బంధ స్థితిగతులపై విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. వీరి ఆందోళన ఘటన మంచిర్యాల జిల్లాలో చర్చనీయంశాంగా మారింది.







