AP: కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నారా భువనేశ్వరి బుధవారం ఖండించారు. “సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదు. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి నా సంఘీభావం ప్రకటిస్తున్నా. ఆమెపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి వ్యాఖ్యలను మహిళా లోకం ఎన్నటికీ క్షమించదు. మహిళలను కించపరిచే చర్యలను తిప్పికొడదాం.” అని భువనేశ్వరి అన్నారు.
Post Views: 29







