TG: ‘కేటీఆర్.. నీకు దమ్ముంటే నీతో పాటు నీ అయ్యను అసెంబ్లీకి తీసుకురా’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సవాల్ చేశారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ ఈ డ్రామాలు ఏంది కేటీఆర్ అని అద్దంకి ప్రశ్నించారు. ‘నీ డ్రామాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నావు. నిన్ను చూస్తుంటే దీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. మీకు శాసనసభ, శాసనాలు అంటే గౌరవం లేదు. శాసనసభ పట్ల నిర్లక్ష్యమని KCRను చూస్తే తెలుస్తుంది’ అని అద్దంకి అన్నారు.
Post Views: 22







