Mahaa Daily Exclusive

  స్కూల్ ఎగ్గొట్టి.. డ్రగ్స్‌ తయారు చేస్తున్న సైన్స్ టీచర్లు..!

Share

రాజస్థాన్, జోధ్‌పూర్‌లోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శ్రీగంగానగర్‌లో రహస్యంగా మాదకద్రవ్యాలను తయారు చేస్తున్న ప్రయోగశాల గుట్టురట్టు చేశారు. స్కూల్ టీచర్లే ప్రాణాంతకమైన మాదకద్రవ్య పదార్థం మెఫెడ్రోన్ తయారు చేస్తున్నారని వెల్లడైంది. 780 గ్రాముల మాదకద్రవ్యాలతో పాటు తయారీ పరికరాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు టీచర్లను అరెస్ట్ చేశారు. వారు స్కూల్‌కి సెలవులు పెట్టి మరీ డ్రగ్స్ తయారీలో మునిగిపోయారు.