Mahaa Daily Exclusive

  ఆర్ధిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య..!

Share

జగిత్యాల జిల్లా మోతె గ్రామానికి చెందిన సంగేపు చందుకుమార్(22) ఆర్ధిక సమస్యలతో మనస్తాపానికి గురై ఈ నెల 6న గ్రామ శివారులో గడ్డి మందు తాగాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుని సోదరుడు సంగేపు రాజకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.