రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రభుత్వ కళాశాలల భవనాలను వెంటనే నిర్మించాలని విద్యా కమిషన్ మెంబెర్ కి టిఎఫ్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిలావస్థలో ఉన్నందున నూతన భవనాన్ని వెంటనే నిర్మించాలని, గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. ఆమనగల్లు మండల కేంద్రం నాలుగు మండలాల ప్రధాన కూడలిగా ఉన్నందున వెంటనే నూతన భవనాన్ని విద్యార్థులకు అందుబాటులో తేవాలని, అదేవిధంగా డిగ్రీ కళాశాల భవాని కూడా వెంటనే అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని, ఆమనగల్లు పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర విద్య కమిషన్ మెంబెర్ డాక్టర్ చారకొండ వెంకటేష్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఎఫ్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్రే సుదర్శన్, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఈర్లపల్లి ప్రవీణ్, తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జ్ మీసాల వర్షిత్, టిఎఫ్ఎస్ నాయకులు శివ, ధనుష్, శివరాజు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.








