రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసి రికార్డులను తారుమారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. మంత్రి పదవి వచ్చినా రాకున్నా ప్రజాసేవకు అంకితం అవుతానని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఆదిభట్ల గ్రామ సమీపంలో సర్వేనెంబర్ 44 లో 18 ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసిన వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. గత రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు గత ప్రభుత్వం హయాంలో రికార్డులన్నీ తారుమారు చేసి ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని ఆయన మండిపడ్డారు. త్వరలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై విచారణ జరిపించి స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారుల అన్నదండలతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న డిప్యూటీ తాసిల్దార్ పై చర్యలు తీసుకోవాలని తాసిల్దారును ఆదేశించారు. గత నెలలో ఇబ్రహీంపట్నం ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్రమాలకు పాల్పడ్డట్టు గుర్తించిన అధికారులు అరెస్టు చేయడం జరిగింది. అయినా డిప్యూటీ తాసిల్దార్ లో మార్పు రాకపోవడం గమనాభమని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఫార్మా రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఫార్మాసిటీని రద్దు చేయడం జరిగిందని వాటి స్థానంలో కాలుష్య రహిత పరిశ్రమలు స్థాపించడం జరుగుతుందని తెలిపారు ఫోర్త్ సిటీ ఏర్పాటుతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి మహర్దశ కలుగుతుందని భీమా వ్యక్తం చేశారు మంచాల మండలం లింగంపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను విద్యుత్ మంచినీటి సౌకర్యం కల్పించి అర్హులైన పేదలకు ఆ యొక్క డబుల్ బెడ్ రూమ్ లను పంపిణీ చేస్తామని తెలిపారు ప్రజలు సహకరిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామన్నారు.
నియోజకవర్గ పరిధిలోని చెరువులను కాపాడుతాం….
నియోజకవర్గ పరిధిలో వందల చెరువులు ఉన్నాయని, వాటిని సంరక్షించే బాధ్యత మాపై ఉందని ఎమ్మెల్యే అన్నారు. గత మూడు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి, నియోజకవర్గంలో అన్యాక్రాంతమైన చెరువులను మాతో కలిసి పరిశీలించారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసబ్ చెరువు అలాగే ఇంజాపూర్ పరిధిలోని చెరువులను హైడ్రా కమిషనర్ డ్రోన్ ద్వారా సమీక్షించారు. చెరువులను కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇంజాపూర్ రెవెన్యూ పరిధిలో 2017 సంవత్సరంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్లో వర్షాకాలం వస్తే పూర్తిగా నీళ్లు రావడం జరుగుతుందని అన్నారు. వేలకోట్ల ప్రజాధనాన్ని గత పాలకులు వృధా చేశారని మండిపడ్డారు.
ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ గౌడ్ మామ పాల్గొన్నారు.








