Mahaa Daily Exclusive

  జిల్లా ఇంచార్జ్ ఆధ్వ‌ర్యంలో రాజ్యంగ ప‌రిర‌క్ష‌ణ ర్యాలీ ..!

Share

ఆదిలాబాద్, మహా : ఆదిలాబాద్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన జిల్లా ఇంచార్జి ఎంపీ అనిల్ కుమార్ యాద‌వ్ తో పాటు ముఖ్య‌ నేత‌లు కార్య‌క‌ర్తలు స‌మావేశ ప్రాంగ‌ణంలో శుక్రవారం రాజ్యంగ ప‌రిర‌క్ష‌ణ ర్యాలీ నిర్వ‌హించారు. దేశంలోని మన రాజ్యాంగ సంస్థలను బలహీనపరచడానికి చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని తిప్పి కొట్టాల‌ని నేత‌లు పిలుపునిచ్చారు.రాజ్యంగ‌ప‌రిర‌క్షణ‌కై జై బాపు జై భీం జై సంవిధాన్ ర్యాలీ చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హందాన్, ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీబీ ఛైర్మెన్ అడ్డి భోజరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ఏఐసీసీ స‌భ్యులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ బోథ్ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జిలు కంది శ్రీ‌నివాస రెడ్డి,ఆడే గజేందర్, శ్యామ్ నాయక్, ఇంద్రకరణ్ రెడ్డి,గోక‌ గణేష్ రెడ్డి, చరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Latest