ఖమ్మం, జులై 12, మహా:
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే- ఐజేయూ) యూనియన్ ఖమ్మం నగర మహాసభ ఈ నెల 13న (ఆదివారం) ఉదయం 10 గంటలకు ఖమ్మం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరుగుతుందని యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు మైస పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు,
(టీయూడబ్ల్యూజే- ఐజేయూ) రాష్ట్ర యూనియన్ ప్రధాన కార్యదర్శి కే రామ్ నారాయణ హాజరవుతారని పేర్కొన్నారు. అతిథులుగా యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్ , రాష్ట్ర సమితి సభ్యులు సామినేని మురారీ, యూనియన్ జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి కనకం సైదులు, ఇతర జిల్లా నగర నాయకులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, డెస్క్ జర్నలిస్టులు, కెమెరా వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ మహాసభలో ఖమ్మం నగరంలో ఉన్న జర్నలిస్ట్ లు పెద్దసంఖ్య లో పాల్గొని విజయవంతం చేయాలని నగర నాయకులు విజ్ఞప్తి చేశారు.








