ముదిగొండ జూలై 12 మహా:
మండల కేంద్రమైన ముదిగొండలో సంచరిస్తున్న కోతులు,కుక్కలతో ప్రజల బెంబేలెత్తుతున్నారు.ఇండ్లు పరిసరాలతో పాటు,బజార్లు సంచరిస్తున్న వారితోపాటు, పొలాలు,స్కూల్ లకి వెళ్లే వారిని భయపెట్టి దాడి చేసి కాటు వేస్తున్న కోతులు,కుక్కలతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.శనివారం వ్యవసాయ పనులకు పొలానికి వెళుతున్న ఓ వ్యక్తితోపాటు,స్కూల్ కి వెళ్తున్న చిన్నారిని మరో ఇద్దరిని కుక్క, కోతులు కాటు వేయటతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేయించుకున్నారు. ఇప్పటికైనా మండల అధికారులు,జిల్లా ఉన్నతాధికారుల స్పందించి కుక్కల,కోతుల భారీ నుండి ప్రజలను కాపాడాలని మండల ప్రజలు కోరారు.
Post Views: 34








