Mahaa Daily Exclusive

  గండం తప్పింది తగ్గుముఖం పట్టిన గోదావరి 41.30 అడుగులకు పెరిగి తగ్గుముఖం జాతీయ రహదారిలో స్థంభించిన రవాణా..!

Share

మహ భద్రాచలం

భద్రాచలం వద్ద గోదావరి 41.30 అడుగుల వరకూ వేగంగా పెరిగి మధ్యాహ్నం నుండి తగ్గుముఖం పట్టడంతో గోదావరి పరివాహక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
మహారాష్ట్రతో పాటు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదనీరు గోదావరిలో కలుస్తుండటంతో భద్రాద్రి వద్ద రెండు రోజులుగా గోదావరి పెరుగుతుంది. శనివారం ఉదయం 6 గంటలకు 40.40 అడుగులు ఉన్న గోదావరి వేగంగా పెరుగుతూ మధ్యాహ్నం 11 గంటలకు 41.30 అడుగులకు చేరింది. రెండు గంటలు నిలకడగా ప్రవహించి తర్వాత నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది.. కాగా 8,61,662 క్యూసెక్కుల వరదనీరు దిగువకు తరలివెల్లినట్లు అధికారులు పేర్కొన్నారు. గోదావరి ప్రస్తుతం శాంతించినా.. గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తoగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.ఇదిలా ఉండగా ములుగుజిల్లా వెంకటాపురం నుండి చతిస్గడ్ రాష్ట్రానికి వెళ్లడానికి వాజీడు మండలం టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయు.

Latest