నేలకొండపల్లి, జూలై 12 మహా:
మట్టి తొలకం పై రెండు వర్గాలు బలప్రదర్శ కు తలపడ్డాయి. ఆ భూమి మాదంటే మాదని…ఇరువర్గాల వారు ఘర్షణ కు దిగారు. వివాదం తారా స్థాయికి చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం కు చేరుకుని ఇరు వర్గాల వారిని స్టేషన్ కు తీసుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం లోని కోనాయిగూడెం శివారు లో ఉన్న గుట్ట (కోరటేన్) వద్ద గత మూడు రోజుల నుంచి మట్టి ని జెసీబీల ద్వారా తరలిస్తున్నారు. శనివారం మట్టి తొలే భూమి తమదని.. కాదు తమదని ఇరువురు రైతులు ఘర్షణ కు దిగారు. మట్టి తరలింపు ను ఓ వర్గం అడ్డుకున్నారు. రెండు వర్గాల కు చెందిన వారు గుట్ట మట్టి వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆరుపులు, కేకల నడుమ వివాదం తారా స్థాయి కి చేరింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం కు చేరుకుని ఇరువర్గాల తో చర్చించి… వారి వద్ద ఉన్న డాక్యూమెంట్స్ తీసుకుని స్టేషన్ కు రావాలని సూచించారు. ఈ మేరకు ఇరువర్గాల వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇరువురి వాదనలు వినిపించారు. మట్టి తొలే భూమి హద్దులు తేలే వరకు ఎవరూ తొలకాలు చేపట్టవద్దని అధికారులు సూచించారు. ఈ వివాదంకు ప్రధాన కారణం మైనింగ్ అధికారులు…మట్టి తొలకాలకు ఎలాంటి అనుమతులు లేనప్పడు తొలకాలను ఎలా అవకాశం ఇచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య చిచ్చు పెట్టారు. కాగా ఇది ఇలా ఉండగా…పెద్ద మొత్తంలో మట్టి ని తరలిస్తుండటంతో స్థానికులు మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మైనింగ్ అధికారుల తీరు పై పలు విమర్శలు వినవస్తున్నాయి. కొరటేన్ గుట్ట మట్టి తొలకాల పై మైనింగ్ ఏడీ ని వివరణ కోరగా…ఎవరికి ఎలాంటి అనమతులు ఇవ్వలేదని…విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కోన్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని గుట్ట మట్టి వ్యవహరం పై స్పందించకుంటే ఉద్రికత్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలుస్తుంది.








