నేలకొండపల్లి, జులై 12 మహా:
కారు అదుపు తప్పి విద్యుత్ స్థంభం ను డీకొట్టింది. తీగలు తెగి పడటంతో స్థానికులు పరుగులు తీశారు…ఈ ప్రమాదంలో చిన్నారితో పాటు ముగ్గురు కు తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం లోని మండ్రాజుపల్లి కి చెందిన పానుగోతు ఉపేందర్ కూసుమంచి మండలం లోని గట్టుసింగారం నుంచి కారులో శనివారం ఇంటికి వస్తున్నారు. మండలం ` లోని రాజేశ్వరపురం వద్దకు రాగానే… ఎదురుగా గేదె వస్తుండటంతో కారు ను తప్పించే క్రమంలో విద్యుత్ స్థంభం ను ఢీకొట్టాడు. దీంతో స్థంభం.విరిగింది. విద్యుత్ తీగలు తెగి పడటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీగలు తగులుతాయని స్థానికులు పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో పానుగోతు ఉపేందర్, మురళీనాయక్ లతో పాట జయంత్కుమార్ (7) అనే చిన్నారి కి తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికులు నేలకొండపల్లి ప్రభుత్వ హస్పిటల్ కు తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో సాగర్ ప్రధాన కాలువ ఉంది…రెప్పపాటు లో పెను ప్రమాదం తప్పింది..అదే మాదిరిగా విద్యుత్ తీగలు తెగి పడటం తో స్థానికులకు ఎలాంటి అపాయం జరగకపోవటంతో ఊపిరిపీల్చుకున్నారు.








