Mahaa Daily Exclusive

  ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలి నలుగురికి గాయాలు..!

Share

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ధన్గోల్-భందేపాల గ్రామాల మధ్య అటవీప్రాంతంలో సోమవారం మందుపాతర పేలింది. పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు గ్రామస్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Latest