హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రోత్సాహంతో ఈనెల 21న గ్రాండ్ జాబ్ మేళా-2025 నిర్వహించనున్నారు. హుజురాబాద్లోని సిటీ సెంటర్లో ఆ రోజు ఉ. 10 గంటల నుంచి సా. 6 గంటల వరకు జరిగే ఈ మేళాలో 10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హత గలవారు పాల్గొనవచ్చు. 70కి పైగా కంపెనీలు 3, 000కు పైగా ఉద్యోగ అవకాశాలను ఫ్రెషర్స్ తో పాటు అనుభవజ్ఞులకు అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆదివారం తెలిపారు.
Post Views: 15








