Mahaa Daily Exclusive

  నిజాయితీతో ప్రజలకు సేవలందించి ఉన్నత స్థాయికి ఎదగాలి…. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి..!

Share

ఖమ్మం,మహా.
నిజాయితీతో ప్రజలకు సేవలందించి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సి‌ఎస్సి శిక్షణ పొందుతున్న ఎస్.హెచ్.జి. మహిళలకు సూచించారు.

ఖమ్మం ఐ.టి. హబ్ లో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి డిజిటల్ ఇండియా మోడల్ సి.ఎస్.సి. శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం సందర్శించారు.

జిల్లాలో 153 మంది స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు శిక్షణలో భాగంగా మొదటి విడత 70 మందికి తరుణి హాట్ సెంటర్ లో శిక్షణ ఇవ్వగా, మిగతా వారికి ఐ.టి. హబ్ లో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా ఈడిపి., ఐటీ స్కిల్స్ పైన శిక్షణ కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ కామన్ సర్వీస్ సెంటర్ శిక్షణ పూర్తి చేసుకుని గ్రామాలలో వ్యాపారవేత్తలుగా కెరియర్ ప్రారంభించ నున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. సాంకేతికత విపరీతంగా పెరిగిందని, ప్రస్తుతం ఫోన్ ద్వారా ప్రతి ఒక్కరికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని, పట్టణాలకు మాత్రమే పరిమితం కాదని అన్నారు. కామన్ సర్వీస్ సెంటర్ సేవలను మరింత విస్తరించవచ్చని అన్నారు. ఆధార్ కార్డ్ అప్ డేట్, బ్యాంకింగ్ సేవలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రవాణా టికెట్ బుకింగ్, పాస్ పోర్ట్ సేవలు , హెల్త్ కార్డ్ సేవలు వంటి అనేక రకమైన సేవలు మనం సిఎస్సి ద్వారా ప్రజలకు అందించవచ్చని అన్నారు.

కామన్ సర్వీస్ సెంటర్ తో పాటు జిరాక్స్ సెంటర్, జనరల్ స్టోర్స్ వంటివి ఏర్పాటు చేసి వ్యాపార విస్తరణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జీవితంలో ఆటంకాలు వచ్చినప్పుడు అధైర్య పడకుండా ముందుకు సాగాలని అన్నారు. గ్రామంలో నిజాయితీతో ప్రజలకు సేవలు అందిస్తే వ్యాపారం క్రమంగా పెరుగుతోందని అన్నారు. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ తెలిపారు.

సి.ఎస్.సి ద్వారా మొదటి విడత శిక్షణ పొందిన మహిళలు మాట్లాడుతూ సిఎస్సీ సెంటర్ ద్వారా గ్రామాల్లో విస్తృతంగా, సంతృప్తికరంగా సేవలు అందిస్తామని, దీంతో పాటు గ్రామాల్లో చిన్న వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించడంలో సహకరించాలని అన్నారు.

అనంతరం సి.ఎస్.సి. దివస్ 16 సంవత్సరాల డిజిటల్ ఇన్ క్లూషన్ సందర్భంగా స్వయం సహాయక సంఘాల సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ కేక్ కట్ చేసి, ఎస్.హెచ్.జి. మహిళలకు బయోమెట్రిక్ డివైస్ లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సి.ఎస్.సి. ప్రాజెక్టు మేనేజర్ బి. హరికృష్ణ కుమార్, టాస్క్ రీజనల్ మేనేజర్ అశోక్ కుమార్ నాయక్, ఖమ్మం ప్రాజెక్ట్ మేనేజర్ లు షేక్ ఫయాజ్, సురేష్ కుమార్, ఈడీపీ ట్రైనర్ బాలూ ప్రవరక్య, డిజి పే ఆధార్ సర్వీస్ మాస్టర్ ట్రైనర్ శ్రీనివాస్ కుమార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Latest