ఖమ్మం , మహా .
30 ఏళ్లుగా సిపిఐతో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తాను ఎక్కడ ఉన్నా సిపిఐతో తన అనుబంధం కొనసాగుతుందని వైరా శాసన సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ తెలిపారు. అభివృద్ధి, -సంక్షేమ కార్యక్రమాల్లో సిపిఐకి తగు ప్రాధాన్యత కల్పిస్తానని ఆయన స్పష్టం చేశారు. బుధవారం వైరా శాసన -సభ్యులు రాందాస్ నాయక్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఖమ్మం గిరిప్రసాద్ భవన్ సిపిఐ కార్యాలయంకు చేరుకుని సిపిఐ, కాంగ్రెస్ వైరా నియోజక వర్గ నేతల సంయుక్త సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యర్రాబాబు -అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాందాస్ నాయక్ మాట్లాడుతూ 30 ఏళ్లుగా కొత్తగూడెం, వైరా (సుజాత నగర్) నియోజక వర్గాల్లో ఏ ఎన్నికలైనా సిపిఐతో కలిసి పని చేస్తున్నానని ఆయన తెలిపారు. వైరా నియోజక వర్గంలో 2023 ఎన్నికల సందర్భంగా సిపిఐ నేతలు అందించిన సహకారం మరువలేనిదని, ఎన్నటికి మరిచిపోనని రాందాస్ నాయక్ తెలిపారు. మతోన్మాద రాజకీయాలు దేశాన్ని కుదిపేస్తున్న సమయంలో కాంగ్రెస్ వామపక్షాలు, ఇతర లౌకిక శక్తులు మరింతగా కలిసి పనిచేయాల్సిన అవసరం పెరుగుతుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైరా -నియోజక వర్గంలో సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న చిన్న పొరపచ్చాలను సరిదిద్దుకుని ముందుకు సాగుతామన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లోనూ సిపిఐ నాయకులు తనను నేరుగా సంప్రదించవచ్చునని భవిష్యత్తులో మరింత సమన్వయంతో ముందుకు సాగుదామని -రాందాస్ నాయక్ తెలిపారు. వైరా నియోజక వర్గ పరిధిలోని వివిధ సమస్యలకు సంబంధించి సిపిఐ నేతల వద్ద -నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు మాట్లాడుతూ తాము కాంగ్రెస్కు నిర్మాణాత్మక మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నామని అనేక రాజకీయ అంశాలకు -సంబంధించి ఏకాభిప్రాయంతో ఉన్నామన్నారు. మిత్రబంధాన్ని ఎన్నికల వరకే పరిమితం చేయకుండా కొనసాగేలా తగు చర్యలు తీసుకోవాలని శాసన సభ్యునికి సూచించారు. స్థానిక సంస్థల్లో విజయమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు రాందాస్ నాయక్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, కాంగ్రెస్ నాయకులు వడ్డే నారాయణరావు, సూరంపల్లి రామారావు, సిపిఐ నాయకులు అజ్మీర రామ్మూర్తి, రావి శివరామకృష్ణ, జాగర్లమూడి రంజిత్ కుమార్, -రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్, వైరా నియోజక వర్గ పరిధిలోని సిపిఐ మండల కార్యదర్శులు,
జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు








