Mahaa Daily Exclusive

  టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటును విరమించుకోవాలి ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కో కన్వీనర్ బండారు రవికుమార్..!

Share

ఆదిలాబాద్, మహా

కుమ్రం భీం ఆసిఫాబాద్ టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటును విరమించుకోవాలని జీవో 49 రద్దు చేయాలని, ఇందుకోసం తీసుకొచ్చిన జీ ఓ 49ను రద్దు చేయాలని ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కో కన్వీనర్ బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ జీవో కారణం గా ఆసిఫాబాద్ జిల్లా లోని 339 గ్రామాలకు మనుగడ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఉట్నూర్ లోని ఓ పంక్షన్ హాల్ లో జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యకర్తల సమావేశం లో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్లో ఉన్నందున గ్రామసభలు నిర్వహించకుండా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోకుండా, పీసా చట్టం అమలు చేయకుండా జీవో తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అటవీ శాఖ ఇప్పటికే ఆదివాసీ గ్రామాలకు ఐటీడీఏ ద్వారా మంజూరైనా బోర్లు, త్రిఫెస్ కరెంట్, రహదారులను గ్రామాలలో వేయనీయకుండా అడ్డుపడుతోందని చెప్పారు. ప్రభుత్వం ద్వారా మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్లను సైతం కట్టకుండా అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే కవ్వాల్ టైగర్ జోన్ పేరుతో ఆదివాసీల అభివృద్ధికి ఎన్నో ఆంక్షలు పెట్టి అడ్డుపడుతున్నారని మళ్ళీ జీ వో 49 టైగర్ కంజర్వేషన్ పేరుతో ఆదివాసీల మనుగడ ప్రశ్న్తార్తకం చేసే ప్రయత్నాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు భూపాల్, ఉడతా రవీందర్, పైళ్ల ఆశయ్య దర్శనాల మల్లేష్, కుశాన రాజన్న, పూసం సచిన్, ఎర్మ పున్నం, తొడసం శంబు, అన్నమొల్ల కిరణ్, బొజ్జ ఆశన్న, కోట శ్రీనివాస్, అశోక్, ఆత్రం తనుష్ తదితరులు పాల్గొన్నారు.

Latest