ఆదిలాబాద్, మహా
మున్సిపల్ కార్మికులకు రూ.26 వేల రూపాయలు కనీస వేతనం చెల్లించడంతో పాటు ఇతరత్రా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ డిమాండ్ చేవారు. బుధవారం సీపీఐ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అథితిగా హాజరై మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు ఉద్యమ కార్యచరణ రూపొందించాలని తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ మాట్లాడుతూ… పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పుర కార్మికులు కష్టపడుతున్నారని అన్నారు. వారి సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతన సవరణ కమిటీ రూ.19 వేలు చెల్లిస్తామని చెబుతున్నా… ఏఐటీయూసి నాయకత్వం రూ.22 వేలు చెల్లించాలన్న ప్రతిపాదన ఉంచిందన్నారు.పెండింగ్ లో ఉన్న ఈ.ఎస్.ఐ, పీ.ఎఫ్ ను సైతం వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు చిరంజీవి, ఏఐటీయూసి నాయకులు సిర్ర దేవేందర్, గాజేంగుల రాజు తదితరులు పాల్గొన్నారు








