ఆదిలాబాద్, మహా
పాఠశాల క్రీడలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని క్రీడా పాఠశాలలో బుధవారం నిర్వహించిన ఎస్.జీ.ఎఫ్ నూతన ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్నికతో పాటు క్రీడా క్యాలెండర్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నామినేటెడ్ పోస్టు కావడంతో సీనియర్ పీడీ అయిన రామేశ్వర్ ను ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నామినేట్ చేశారు. ఈ సందర్భంగా పీ.ఈ.టీ లు, పీడీలు ఆయనకు అభినందనలు తెలియచేశారు. ఈ సందర్భంగా డీఈఓ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… జాతీయ, రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచేలా శిక్షణలు అందించాలని, ఎస్.జీ.ఎఫ్ తరపున జిల్లా, జోనల్ స్థాయిలో పోటీలు నిర్వహించాలన్నారు. పీడీలకు ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. పాటశాల క్రీడలు విజయవంతమయ్యేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ఎస్జీఎఫ్ మాజీ కార్యదర్శి కాంతారావు, స్పోర్ట్స్ స్కూల్ హెచ్ ఏం భూమన్న, నడిమేల హరిచరణ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.








