ఆదిలాబాద్, మహా
ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో జరిగిన పొరపాట్లను మండల విద్యాధికారులతో గాని ప్రధానోపాధ్యాయులతో గాని కమిటీ వేసి పిల్లల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని, ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ సజావుగా చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి జలంధర్ రెడ్డి లుకోరారు. బుధవారం డీఈ ఓ ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీర్ఘకాలికంగా సెలవులో ఉన్న ఉపాధ్యాయులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఏ విధంగానైతే సర్ ప్లస్ టీచర్లను గుర్తించారో అదేవిధంగా ఉపాధ్యాయుల అవసరం ఉన్న పాఠశాల ను విద్యార్థుల సంఖ్య కు అనుగుణంగా గుర్తించి ప్రక్రియ చేపట్టాలన్నారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
Post Views: 58








