Mahaa Daily Exclusive

  కజ్జర్ల స్కూల్ కు తాళం విద్యార్థుల ధర్నా…..!

Share

తలమడుగు జులై 16 మహా న్యూస్: జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను జిల్లా అధికారులు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా తలమడుగు మండలంలోని కజ్జర్ల ప్రాథమిక పాఠశాలలో బోధిస్తున్నటువంటి ముగ్గురు ఉపాధ్యాయులను ఈ సర్దుబాటు ప్రక్రియలో భాగంగా వేరే చోటికి పంపించడానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు ఈ సర్దుబాటు ప్రక్రియను ఖండిస్తూ మంగళవారం అదరపు కలెక్టర్ కి మా ఉపాధ్యాయులు మాకు తిరిగి పంపించాలని వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఎలాంటి స్పందన లేకపోవడంతో బుధవారం రోజు పాఠశాల గేటుకు తాళం వేసి విద్యార్థులు వారి తల్లిదండ్రులు అమ్మ ఆదర్శ పాఠశాల సభ్యులు గ్రామస్తులు గేటు ముందర బైటాయించి ధర్నాను చేపట్టారు. గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామంలో ఆరుగురు ఉపాధ్యాయులు ఉండగా ముగ్గురు ఉపాధ్యాయులను ఈ సారదుబాటు ప్రక్రియలో వేరే చోటికి పంపించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రవేటు పాఠశాలలో చదివిపిస్తున్న మా పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు మంచి విద్యను బోధిస్తున్నారని నేపథ్యంతో మా పిల్లలు మా కళ్ళ ముందు ఉంటారని నమ్మకంతో ఇక్కడ చేర్పించడం జరిగింది. కానీ పై అధికారులు విద్యార్థులు చేరింది పక్కనపెట్టి. ముగ్గురు ఉపాధ్యాయులను పంపించడం సరికాదని రేపటి వరకు మా ఉపాధ్యాయులు మాకు యధా స్థానానికి రానియెడల ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్న విద్యార్థులు అందరూ మూకుమ్మడిగా టిసీలు తీసుకొని ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తామని పిల్లల తల్లిదండ్రులు మూకుమ్మడిగా డిమాండ్ చేశారు. పాఠశాలలో క్లాస్ కు ఒక ఉపాధ్యాయుడు లేనప్పుడు అలాంటి పాఠశాలలో మా పిల్లలని ఎందుకు చదివిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడిప్పుడే పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య ఇలా చేయడం వల్ల తగ్గే అవకాశం ఉందనీ తల్లిదండ్రులు హెచ్చరించారు. డబ్బు లేని పేదవాళ్లు కూడా అప్పోసొప్పు చేసి ప్రైవేటు పాఠశాలలో వేస్తాము తప్ప మా పిల్లలను ఇలా ఉపాధ్యాయులు తక్కువ ఉన్న పాఠశాలలో ఉంచమని మా ఉపాధ్యాయులు తిరిగి రాని యెడల మా పిల్లల భవిష్యత్తు కన్నా ఏది ఎక్కువ కాదని ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తామని తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. జిల్లా అధికారులు దీనిపై దృష్టి సారించి ఆ విద్యార్థులకు న్యాయం చేస్తారో లేదో చూడాల్సిందే. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కిరణ్ కుమార్, దేవ రెడ్డి, గంగన్న, నవీన్, రాములు, స్వామి , సంతు, సురేష్, అవినాష్, రాజు, ప్రశాంత్, విద్యార్థులు వారి తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Latest