రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
అన్యాక్రాంతం అవుతున్న సర్కార్ భూములను కాపాడాలని ఆదిభట్ల గ్రామానికి చెందిన ప్రజలు ఎమ్మెల్యేను కోరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, ఆదిభట్ల గ్రామంలో ఉన్న రెవెన్యూ సర్వే నెంబర్ 44, 45, 51, 52, 53,101,107, 108లో గల సర్కారు భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జాలకు పాల్పడ్డారని, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని కలిసిన ఆదిభట్ల గ్రామ ప్రజలు, అధికారులతో చర్చించి సర్కార్ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ అక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకునే విధంగా సర్కారు అధికారులతో చర్చించి, సర్కారు భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సర్కారు భూములు ఉంటే పేదల వద్ద ఉండాలి, లేదంటే సర్కార్ వద్ద ఉండాలి, కానీ ప్రైవేటు వ్యక్తుల వద్దా ఎలా ఉంటాయని, కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని తెలిపారని గ్రామస్తులు అన్నారు.








