భూపాలపల్లి, మహా :
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం రాత్రి భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తల తో సమావేశం నిర్వహించారు. ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు చిట్యాల మండల కేంద్రంలో జరిగే మహిళా శక్తి సంబురాలకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క రానున్నట్లు తెలిపారు. ఈ సంబురాల్లో అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనేలా చూడాలని నేతలకు ఎమ్మెల్యే సూచించారు.
Post Views: 73








