Mahaa Daily Exclusive

  ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే ..!

Share

వరంగల్ మహా;

మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మ గౌరవంతో జీవించాలని, వర్ధన్నపేట శాసనసభ్యులు కె ఆర్ నాగరాజు అన్నారు. బుధవారం హన్మకొండ లోని అంబేద్కర్ భవన్ లో ఘనంగా
ఇందిరా మహిళా శక్తి సంబురాలు కలెక్టర్ డాక్టర్ సత్య శారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్షన్నపేట నియోజకవర్గ పరిధిలోని పర్వతగిరి, ఐనవోలు, హసన్ పర్తి మండలాల పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, సెర్ఫ్ ఆధ్వర్యంలో వడ్డీలేని రుణాలు, బ్యాంక్ లింకేజీ, ప్రమాదభీమా, రుణభీమా, మహి ళా సంఘాల ద్వారా నడుపుతున్న ఆర్టీసి బస్సుకు అద్దె చెల్లింపులు, నూతన రేషన్ కార్డు ల అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ కేం ద్రాలు, ఆర్టీసి బస్సులు ఇస్తున్నామని తెలిపారు. సోలార్ విద్యుత్ను రెడ్ కో సంస్థ ద్వారా తిరిగి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. మహిళా సంఘా ల ద్వారా ధాన్యం కొనుగోలు చేశామని, ప్రభుత్వ ఉద్దేశ్యం, లక్ష్యంగా మహిళల ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు.
మహిళ సంఘాలకు రూ.10 లక్షల రూపాయలు ప్రమాద భీమా, రుణ భీమా రూ.22 లక్షలు, బ్యాంకు లింకేజీ రూ. 40.కోట్ల 45 లక్షలు, వడ్డీ లేని రుణాలు రూ.7 కోట్ల 76 లక్షలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
నియోజకవర్గంలో మొత్తం 3532 మహిళా సంఘాలలో 39,212 మంది సభ్యులున్నారని తెలిపారు. మహిళలు తలుచుకుంటే చేయలేనిది ఏమీ ఉండదని ఇంట్లో వంట నుండి పిల్లల విద్యాభ్యాసం వరకు అన్నింటిలోనూ మహిళలు ముందుంటారని తెలిపారు. గత పది సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం మహిళలకు పైసా కూడా వడ్డీలేని రుణాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. అవసరాన్ని బట్టి రుణాలు, వనరులు సమకూర్చి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వ్యావార వేత్తలుగా తయారు చేయన్నున్నట్లు తెలిపారు. మీ శక్తి, యుక్తికి వాణిజ్య, వ్యా వార, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం గొప్ప ఆలోచనలతో ముందుకు పోతున్నట్లు తెలిపారు. మ హిళా సంఘాల ద్వారా 3 కోట్ల రూపాయలతో సోలార్ విద్యుత్ ప్లాంట్స్ హసన్ పర్తిలో ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా
ప్రభుత్వానికి విద్యుత్ విక్రయించి సంఘాల సభ్యులకు ఆదాయం సమకూర్చేల చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. హసన్ పర్తి, పర్వతగిరి, వర్షన్నపేట లోని 3 మహిళా సమాఖ్యలకు కోటి 18 లక్షల వ్యయంతో 3 ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించి మహిళలచే ఆర్టీసీ కు అద్దెకు ఇవ్వనున్నట్లు తెలిపారు. డిఆర్డీవో ఆధ్వర్యంలో 16 కేంద్రాల ద్వారా165 మందికి మహిళలకు కట్టుమిషన్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేస్తుస్తున్నామని,
నియోజకవర్గంలో ఇప్పటివరకు 1010 నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు 3850 మందిని అదనంగా రేషన్ కార్డులలో పేర్లు నమోదు చేసి మొత్తం 4860 నూతన రేషన్ కార్డులు సభా వేదిక ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని దరఖాస్తు చేసుకున్న అర్హత గల ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని అన్నారు.ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేసి నాకంటూ సొంత ఇల్లు ఉండాలి అనేది కల గానే మిగలకుండా ఇందిరమ్మ ఇండ్లను విడతల వారిగా మంజూరు చేస్తూ నిరుపేదల కలలను నిజం చేసిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. మహిళలు రానున్న రాజకీయాల్లో మహిళలకే ప్రాధాన్యం ఇచ్చుటకు ముఖ్యమంత్రి కంకణబద్ధులై ఉన్నారని అన్నారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి విశేష కృష్టి చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. మహిళా సంఘాల ద్వారా ఇందిరా మహిళా క్యాంటీన్లు, వడ్డీలేని రుణాలు, దాన్యం కొనుగోలు కేంద్రాలు, యూనిఫామ్స్ కుట్టు పనులతో పాటు త్వరలో వర్ధన్నపేట మండలం లోని కాట్రియాల
మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మహిళా సాధికారితకు టీం వర్క్ పని చేయాలనికలెక్టర్ పిలుపునిచ్చారు.
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ల ద్వారా కిషోర్ బాలికల పథకం కొనుగోలు కేంద్రాలు ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్, సోలార్ ప్యానల్స్, పెట్రోల్ బంక్ ల వంటి పథకాలు మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని మహిళా సంఘాల గ్రూప్ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

గత సంవత్సరం మహిళ శిశు అభివృద్ధి శాఖ, డి ఆర్ డి ఓ ఆధ్వర్యంలో యూనిసెఫ్ ఎన్జీవో ఆధ్వర్యంలో స్నేహ (సొసైటీ ఫర్ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ యాక్షన్) కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.

ప్రస్తుతం మధ్యాహ్నం భోజన పథకంలో ఉపయోగించే పప్పులు కూరగాయలు తదితర గ్రాసరీస్ లను మహిళా సంఘాల ద్వారా సేకరించుటకు ఒక వినూత్న ప్రయత్నాన్ని చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్త్రీ నిధి ద్వారా మరణించిన వారి కుటుంబాలకు భీమా క్రింద 27 మందికి 32 లక్షలు, 2497 ఎస్ హెచ్ జి లకు 7.76 కోట్ల రూపాయల వడ్డీలేని రుణం, 609
ఎస్ హెచ్ జి లకు రూ 40.47 కోట్ల బ్యాంక్ లింకేజీ చెక్కులను, నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే, కలెక్టర్ లు లబ్దిదారులకు అందించారు.
ఈ సందర్భంగా పర్వతగిరిలో రూ 4 కొట్ల 76 లక్షల విలువగల రెండు వ్యవసాయ గోడౌన్ల ను మండల మహిళ సంఘానికి, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ మహిళ రైతులకు కేటాయించిన మంజూరు పత్రం అందించారు.
అనంతరం స్వయం సహాయక సంఘాలచే ప్రదర్శించిన ఉత్పత్తులను కలెక్టర్, ఎమ్మెల్యే లు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, సెర్ప్ డైరెక్టర్ నవీన్, జెడ్పి సీఈఓ రామిరెడ్డి,
డిఆర్డీవోలు కౌసల్యాదేవి, మెనూ శ్రీను,ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి తహశీల్దార్లు, ఎంపీడీవోలు, నాలుగు మండలాల సింగిల్ విండో చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.

Latest