Mahaa Daily Exclusive

  భారత రాజ్యాంగం చాలా గొప్పది ఎంఎల్ఏ బిఎల్ఆర్ ..!

Share

మిర్యాలగూడ మహా
ప్రపంచ రాజ్యాంగలలో అత్యంత గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగమని మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ అన్నారు.గురువారం స్థానిక ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం తెలుగు పుస్తక ప్రతిని అందజేసిన సందర్భంగా మాట్లాడతూ ప్రపంచ దేశాలు భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తుయన్నారు. రాజ్యాంగంలో పొందుపరచిన అంశాలు ఇప్పటికీ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా వున్నదని చెప్పారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను ప్రతి ఒక్కరూ చదవి అవగాహన చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం నల్గొండ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, ఎల్ హెచ్ పిఎస్ జిల్లా అధ్యక్షులు సిద్దు నాయక్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ శేఖర్ రెడ్డి, శంకర్ రెడ్డి, దాస్యనాయక్, బాలోజి నాయక్ పాల్గొన్నారు.

Latest