Mahaa Daily Exclusive

  సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు వెంటనే నీటిని విడుదల చేయాలి మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి ..!

Share

మిర్యాలగూడ మహా
వానకాలం సరైన సీజన్ అని ప్రస్తుతం నాట్లు వేస్తే దిగుబడి మంచిగా వస్తుందని నాగార్జునసాగర్ ఎడమ కాలవ ఆయకట్టుకు వెంటనే నీటిని విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ డ్యాంలో 560 అడుగుల నీటి మాత్రం ఉందని, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఆయకట్టుకు నీరు విడుదల చేశారనీ ఆయన తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ఆయకట్టు పరిధిలో రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారని ఇప్పటికే దుక్కిలు దున్ని, నారు మడులు వేసుకొని నాట్లు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు బోర్లు బావుల కింద ఇప్పటికే నార్లు వేసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయకట్టు పరిధిలో వర్షాభావం వల్ల చెరువులు, కుంటలు, కాలువలు ఎండిపోయి ఉన్నాయని నీటిని విడుదల చేసి చెరువులు కుంటలు నింపాలని దీని వలన భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం ఎడమ కాలుకు నీటిని విడుదల చేసినట్లయితే ఆయకట్టు పరిధిలో రైతులు కొంతమంది నార్లు పోసుకుంటారని కొంతమంది నాట్లు వేసుకుంటారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలని షెడ్యూలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అవసరమైన కల్తీ లేని నాణ్యమైన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. పంటలు సాగు చేసుకున్నందుకు పెట్టుబడులకు అవసరమైన రైతు భరోసా, రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి ఎం.రవినాయక్, తిరుపతి రామ్మూర్తి, అప్పారావు, నాగరాజు పాల్గొన్నారు.

Latest