తలమడుగు మహా న్యూస్,
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీల పథకం 16 వ విడత సామాజిక తనిఖీ ప్రకావేదిక ను గురువారం రోజు తలమడుగు మండల కేంద్రంలో నిర్వహించరు. మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకంలో పని చేసినటువంటి సభ్యుల వివరాలను అర్థవంతంగా తనిఖీ సభ్యులు రాతపూర్వకంగా రాసుకొని వారి వారి గ్రామపంచాయతీలలో గ్రామసభ నిర్వహించి అనంతరం గురువారం ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో జిల్లా అధికార యంత్రాంగం ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తనిఖీలలో చాలా గ్రామాలలో మొక్కలు పెట్టినటువంటివి వాడిపోయి పనికి రాకుండా కింద పడిపోయి 25 నుంచి 30% వరకే మొక్కలు బ్రతికి ఉండడం అధికారుల సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వలెనని తనిఖీ సిబ్బంది వివరించడం జరిగింది. గ్రామపంచాయతీ కార్యదర్శులు రిజిస్టర్లలో రికార్డ్స్ సరిగ్గా రాయనందున కొంతమంది అసలే రికార్డ్ రాయని వారిని అధికారులు మందలించడం జరిగింది. ఓ అధికారికి గతంలో కూడా ఈ సామాజిక తనిఖీ నేపథ్యంలో 1000 రూపాయలు జరిమాన వేయడం జరిగింది మళ్లీ అదే తప్పు చేయడం వల్ల 5000 జరిమానా వేస్తామని అధికారులు తనిఖీలు హెచ్చరించారు. కొంతమంది పనులకు పోకుండా వారి వారి అకౌంట్లో డబ్బులు పడ్డాయని ఆయాలకు ఆశలకు కూడా పని కల్పించినట్టు వారి రికార్డుల్లో ఉందని తనిఖీ సిబ్బంది చెప్పడం జరిగింది. చాలా గ్రామపంచాయతీలలో పని చేసినటువంటివి నేమ్ బోర్డ్స్ పెట్టించలేదని అవి త్వరగా పెట్టించాలని జిల్లా అధికారులు మండల పై మండిపడి వెంటనే నేమ్ బోర్డ్స్ పెట్టించారని పనిచేసినటువంటి పనిని చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడి రవీందర్ రాథోడ్, శిక్షణ కలెక్టర్ సలోని, అడిషనల్ పిడి కుటుంబరావు, ఏపీడి కృష్ణారావు, ఎంపీడీవోలు చంద్రశేఖర్, శంకర్ , తనిఖీ సిబ్బంది అధికారి రాజేశ్వర్, ఏపిఎం సెక్రటరీలు టిఏ లు ఫీల్డ్ అసిస్టెంట్స్ తనకి సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.








