Mahaa Daily Exclusive

  ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంలో 9 మందిపై కేసులు నమోదు వివరాలు వెల్లడించిన మట్టేవాడ ఇన్స్పెక్టర్ తుమ్మ గోపిరెడ్డి ..!

Share

వరంగల్ మహా;

ఇటీవల నకిలీ సర్టిఫికెట్లు జారీ వ్యవహారంలో పోలీసులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం వేణు రావు కాలనీ వరంగల్ నందు హనుమాన్ ఆన్లైన్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి నల్లబెల్లి అమరేందర్ అను వ్యక్తి వివిధ వ్యక్తుల ద్వారా ప్రజలకు అత్యవసరంగా కావలసిన ఆధార్ కార్డులలో మార్పులు, బర్త్ సర్టిఫికెట్లు, రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు, మార్పిడి కావాలంటే నకిలీగా సదరు నిందితుడు అమరేందర్ తయారు చేస్తాడని అతనికి కొంతమందితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా మీ సేవల వద్దకు వచ్చిన ప్రజలకు అవసరం ఉన్న వివిధ సర్టిఫికెట్ల తో పాటు ఆధార్ నమోదు వ్యక్తులతో పరిచయం చేసుకొని సదరు అమరేందర్ నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి ఆధార్ కార్డులలో నమోదు చేస్తుండగా అతనిపై కేసు నమోదు చేసి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా అతని తో సంబంధాలు కలిగి ఉన్న 9మంది వ్యక్తులను గురువారం మట్టేవాడ పోలీసులు అరెస్ట్ చేసి వారి వివరాలను వెల్లడించారు. వీరిని పోచమ్మ మైదాన్ కార్ల అడ్డవద్ద ఉండగా మట్టెవాడ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగిందని ఇన్స్పెక్టర్ తుమ్మ గోపిరెడ్డి తెలిపారు.

Latest