Mahaa Daily Exclusive

  రైల్వే జిఎం ను కలిసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జాన్ పాక వద్ద ఆర్ఓబి నిర్మించాలని కోరిన కలెక్టర్, కూడా చైర్మన్, వైస్ చైర్మన్..!

Share

వరంగల్ మహా;

సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవను గురువారం కాజీపేటలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, వైస్ చైర్ పర్సన్ చాహత్ బాజ్పాయ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వరంగల్ లోని జాన్ పాక ఎల్ సి 63ఏ ను మూసి వేస్తూ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని రైల్వే అధికారులు నిర్ణయించిన నేపథ్యంలో దాని ప్రక్క నుండి కుడా ఆధ్వర్యంలో ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తున్నందున రైల్వే అండర్ బ్రిడ్జ్ కు బదులు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కలెక్టర్, కుడా చైర్మన్, వైస్ చైర్మన్ లు రైల్వే జీఎం ను కోరగా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వీరి వెంట కుడా పిఓ అజిత్ రెడ్డి, వరంగల్ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Latest