హన్మకొండ మహా;
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు వరంగల్ ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం ఫాతిమా సెంటర్లో ముందస్తు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఆర్టీసీ బస్సు, స్కూల్ బస్సు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం తప్పనిసరిగా స్కూల్ బస్సు నడిపే డ్రైవర్లను వారు తాగి ఉన్నారా లేదా అని పరీక్షించాలని, అలాగే ఆర్టీసీ యాజమాన్యం సైతం బస్సు డ్రైవర్లను కూడా తప్పనిసరిగా రోజువారి తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని. ఇటీవల కాలంలో అధిక శాతం మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురై మరణిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా భారీ వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ఇలాంటి ప్రమాదాల నివారణకై స్కూల్ బస్సుల తో పాటు ఆర్టీసీ డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఏసీపీ తెలిపారు. ఈ తనిఖీల్లో కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు








