Mahaa Daily Exclusive

  మహిళలు ఆర్థికంగా ఎదగాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి..!

Share

హన్మకొండ మహా;

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.
గురువారం పరకాల సమీపంలోని మహాదేవ కన్వెన్షన్ హాలులో ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భాగంగా పరకాల నియోజకవర్గంలోని మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాల పంపిణీ, పరకాల నడికుడ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, పరకాల ఆర్డిఓ డాక్టర్ నారాయణ, హనుమకొండ, వరంగల్ జిల్లాల డిఆర్డిఓలు మేన శ్రీను, కౌసల్య దేవి,తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బ్యాంకు లింకేజీ రుణాలలో 2024- 25 సంవత్సరానికి గాను నియోజకవర్గంలోని పలు మండలాలకు రూ. 118 కోట్లు, 2025- 26 సంవత్సరానికి గాను రూ. 17 కోట్లు , వడ్డీ లేని రుణాలలో 2024 -25 సంవత్సరానికి గాను రూ. 3.85 కోట్లు, 2025-26 సంవత్సరానికి గాను రూ. 78 లక్షలు, లోన్ బీమా కింద 34 క్లేయిమ్ లను పరిష్కరించి రూ. 30.26 లక్షలు, ఆరు ప్రమాద బీమా క్లెయిమ్ లను పరిష్కరించి రూ.60 లక్షలు చెక్కులను, అదేవిధంగా గీసుకొండ, సంగెం మండలాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు రూ. 6.78 ఓట్లు, బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 13.42 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులను మహిళా సంఘాల సభ్యులకు ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా అధికారులు అందజేశారు.
ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొనే వారిని, నేడు విభిన్న రంగాల్లో రాణిస్తూ ప్రథమ స్థానంలో నిలుస్తున్నారని అన్నారు. మహిళల అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నామని అన్నారు. రాబోయే రోజులలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తు నియోజకవర్గ మహిళల అభివృద్ధి ధ్యేయంగా మహిళా డెయిరీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పరకాల నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంలో చేయడంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు కృషి మరువలేనిదన్నారు. అనంతరం కలెక్టర్లు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకుకుట్టు శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకునేందుకు మహిళలు ముందుకు వస్తున్నారని అన్నారు. మహిళలను వ్యాపారస్తులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 32 కోట్ల రూపాయలతో మహిళల భాగస్వామ్యంతో మహిళా డెయిరీ ని త్వరలో ఏర్పాటు చేసుకోబోతున్నట్లు తెలిపారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అందరూ సహకరించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లు , ఉచిత కరెంటు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని అన్నారు. 3238 మహిళా సంఘాలకు కోట్లాది రూపాయల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మహిళలు తమ సొంత కాళ్లపై ఆర్థికంగా నిలబడేలా ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తున్నారు. పరకాల నియోజకవర్గానికి సంబంధించి వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ల లను మహిళా సంఘాల సభ్యులు, అధికారులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా మహిళా సంఘాల సభ్యులను ఎమ్మెల్యే, కలెక్టర్లు శాలువాలతో సన్మానించారు.
అనంతరం నూతన రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు.
ఈ సందర్భంగా పరకాల, నడికూడ మండలాలకు చెందిన 2483 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో పరకాల, నడికూడ తహసీల్దార్లు, డిఆర్డిఏ అధికారులు, నియోజకవర్గంలోని వివిధ మండలాల చెందిన మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Latest