Mahaa Daily Exclusive

  ఎమ్మెల్యేలను కలిసిన టిడబ్ల్యూ జేఎఫ్ జిల్లా నూతన కమిటీ జర్నలిస్టుల సంక్షేమానికి మావంతు సహకారం అందిస్తాం న్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ..!

Share

వరంగల్ మహా;

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) వరంగల్ జిల్లా నూతన కమిటీ కార్యవర్గ సభ్యులు గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి లను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. ఈసందర్భంగా టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈసందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. తన పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానన్నారు.
అనంతరం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. సమాజంలో పడిపోతున్న విలువలు కాపాడడానికి జర్నలిస్టులు కృషి చేయాలన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలను కలిసిన వారిలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జక్కుల విజయ్ కుమార్ కార్యదర్శి బొట్ల స్వామిదాసు, ఉపాధ్యక్షులు వెళ్ది రాజేందర్, కరిమిల్ల దుర్గారావు, సహాయ కార్యదర్శులు బావండ్లపల్లి కిరణ్ కుమార్, రాంపెల్లి శ్రీనివాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ పాలడుగుల సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

Latest